టైరు పేలి బోల్తాకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం

  • బాలుడికి తీవ్రగాయాలు
  • కోదాడ శివారు కోమరబండ కూడలి వద్ద ఘటన
  • మృతుల వివరాలు తెలియాల్సి ఉంది
వేగంగా వెళ్తున్న కారు టైరు ఒకటి పేలడంతో అదుపుతప్పి బోల్తాకొట్టిన సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి సమీపంలోని కోమరబండ కూడలి వద్ద బుధవారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు నలుగురు వ్యక్తులతో వస్తున్న కారు కూడలి సమీపంలోకి రాగానే ప్రమాదం బారినపడింది. కారు పలుమార్లు పల్టీలు కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన కోదాడ వైద్యశాలకు తరలించారు. కాగా, మృతులు ఎవరు, ఎక్కడి వారు అన్న వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Suryapet District
kodad
Road Accident

More Telugu News